AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reporter-Dog:  లైవ్ న్యూస్ ఇస్తున్న రిపోర్టర్.. మైక్ లాక్కొని పారిపోయిన కుక్క.. తర్వాత ఎం అయ్యిందో చూడండి..

Reporter-Dog: లైవ్ న్యూస్ ఇస్తున్న రిపోర్టర్.. మైక్ లాక్కొని పారిపోయిన కుక్క.. తర్వాత ఎం అయ్యిందో చూడండి..

Anil kumar poka
|

Updated on: Sep 03, 2022 | 9:12 PM

Share

సోషల్‌మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు...


సోషల్‌మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఆ సన్నివేశాలను గుర్తుచేసుకొని మరీ నవ్వుకుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళా న్యూస్ రీడర్ స్టూడియోలో ఓ వార్తకు సంబంధించిన విశేషాలను అందిస్తుండగా ఆ న్యూస్‌ను రిపోర్టర్ కవర్ చేస్తుంది. రిపోర్టర్ ఛానల్ మైక్ పట్టుకుని రిపోర్ట్ ఇస్తుండగా.. అకస్మాత్తుగా ఓ కుక్క పరుగున వచ్చి రిపోర్టర్ చేతిలోని మైక్ లాక్కొని పారిపోయింది. లైవ్ న్యూస్ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో షాక్ తిన్నారు రిపోర్టర్, న్యూస్ రీడర్.. వెంటనే తేరుకున్న మహిళా రిపోర్టర్ తన మైక్ తనకు ఇవ్వమంటూ.,. కుక్క వెనుక పరుగెత్తింది. ఈ మొత్తం ఘటనకు చెందిన వీడియో చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. మేము చేయలేనిది కుక్క చేసింది అంటూ కుక్క చేసిన పనికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. వేలమంది లైక్‌ చేశారు. అయితే ఈ వీడియో పాతదే.. కానీ ఇప్పుడు మళ్ళీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో తాజాగా మరోసారి వైరల్‌గా మారింది. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టూడియో యాంకర్ లుక్ చూడాల్సిందే అని కొందరు ఫన్నీ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 03, 2022 09:12 PM