Surgery to Snake: పాముకు సర్జరీ.. ఎన్ని కుట్లు వేశారో తెలుసా..? వీడియో వైరల్..

Surgery to Snake: పాముకు సర్జరీ.. ఎన్ని కుట్లు వేశారో తెలుసా..? వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 10:38 PM

పాములను చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతాం.. భయంతో వణికిపోతాం. అలాంటిది ఓ విషపూరిత పామును కాపాడి శస్త్రచికిత్స చేయించాడో యువకుడు. కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్న పాముకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. దారితప్పిన ఓ పాము పాడేరులోని విజేత కాలేజీలోకి చొరబడింది. బయటకు రాలేక రేకుల్లో ఇరుక్కుపోయింది.

పాములను చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతాం.. భయంతో వణికిపోతాం. అలాంటిది ఓ విషపూరిత పామును కాపాడి శస్త్రచికిత్స చేయించాడో యువకుడు. కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్న పాముకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. దారితప్పిన ఓ పాము పాడేరులోని విజేత కాలేజీలోకి చొరబడింది. బయటకు రాలేక రేకుల్లో ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు దాన్ని గుర్తించిన కొందరు రక్షించే ప్రయత్నించారు. బుసలు కొడుతుండటంతో భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న వాసు అనే యువకుడు.. రేకుల మధ్య గాయాలతో ఇరుక్కుపోయిన పామును బయటకు తీశారు. పశు వైద్యుల సహకారంతో సపర్యలు చేశారు.

విజేత కళాశాలలో రెండు రోజులుగా ఆరడుగుల పొడవైన జెర్రిపోతు పాము రేకుల మధ్య ఇరుక్కుపోయింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్నేక్ క్యాచర్ వాసు అతి కష్టం మీద పామును బయటకు తీశారు. పాము శరీరంపై మూడు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే పశు వైద్యులను పిలిచి వైద్యం చేయించారు. వెటర్నరీ ఏడి రాజా రవీంద్ర సమక్షంలో వైద్యుల బ పాముకు సర్జరీ చేశారు. మూడు చోట్ల లోతైన గాయాలు అవడంతో 8 కుట్లు వేశారు. వైద్యం అనంతరం వాసు ఆ పాముని తన ఇంట్లో పర్యవేక్షణలో ఉంచారు. వాసు పడిన కష్టానికి వైద్యులు కూడా సహకారం తోడవడటంతో ఎట్టకేలకు ఆ పాము ప్రాణాలను కాపాడగలిగారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 12, 2023 10:13 PM