Selfie: సెల్ఫీ పిచ్చితో ప్రమాదం..కాలుజారి లోయలో పడ్డ వధువు.. ఇంక పెళ్లి సంగతి ఏంటో..
రళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్.కుమార్‌కు
రళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్.కుమార్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9న ఘనంగా వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. తర్వాత దగ్గర్లోనే ఉన్న క్వారీని చూడడానికి అందరూ వెళ్లారు.అదే సమయంలో విని కృష్ణన్, శాండ్ర క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయింది శాండ్ర. వెంటనే వరుడు కూడా ఆమెను కాపాడడానికి దూకేశాడు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న శాండ్రను విని కృష్ణన్ కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు.ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సహాయక సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా గాయపడిన వీరిద్దరూ కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

