Accident: బైక్‌పై రైడ్‌కి వెళ్తున్న యువతి,యువకులు.. చూస్తుండగానే అంత అయిపోయింది.!

|

Aug 21, 2023 | 8:04 AM

అతివేగం ప్రమాదకరం.. నెమ్మదిగా వెళ్లండి అని ఎన్నిసార్లు చెప్పినా యువత పట్టించుకోవట్లేదు. వాహనాలపై రద్దీ రోడ్లపైన సైతం అతివేగంతో దూసుకుపోతున్నారు. కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా అతి వేగం కారణంగా మరో నిండుప్రాణం బలైపోయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతున్న బైక్ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టడంతో వెనక సీటుపై ఉన్న యువతి..

అతివేగం ప్రమాదకరం.. నెమ్మదిగా వెళ్లండి అని ఎన్నిసార్లు చెప్పినా యువత పట్టించుకోవట్లేదు. వాహనాలపై రద్దీ రోడ్లపైన సైతం అతివేగంతో దూసుకుపోతున్నారు. కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా అతి వేగం కారణంగా మరో నిండుప్రాణం బలైపోయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతున్న బైక్ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టడంతో వెనక సీటుపై ఉన్న యువతి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి దుర్మరణం చెందింది. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

కోల్‌కతాకు చెందిన స్వీటీపాండే అనే యువతి తన స్నేహితుడు రాయన్ ల్యూకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు బైక్‌పై బయలుదేరింది. రాయన్ తన వాహనాన్ని వేగంగా నడపడంతో వాహనం అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ వెనుక సీటుపై కూర్చున్న స్వీటీ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడిపోయింది. రాయన్ గోడను బలంగా ఢీకొనడంతో అతడికీ గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా తీవ్రగాయాల పాలైన స్వీటీ చికిత్స పొందుతూ మ‌ృతి చెందింది. ఉదయం నాలుగు గంటల సమయంలో JNTU నుంచి ఐకియా వైపు ఫ్లై ఓవర్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...