Vande Bharat: వందేభారత్‌ రైలుకు తప్పిన అతిపెద్ద ప్రమాదం.. ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు

గుర్తు తెలియని దుండగులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే వందేభారత్‌ రైళ్లపై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఒక వందే భారత్ ట్రైన్‌కు అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఉదయ్‌పూర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత భిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు పేర్చి ఉండటాన్ని గమనించారు లోకో ఫైలట్.

Vande Bharat: వందేభారత్‌ రైలుకు తప్పిన అతిపెద్ద ప్రమాదం.. ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు

|

Updated on: Oct 03, 2023 | 3:16 PM

గుర్తు తెలియని దుండగులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే వందేభారత్‌ రైళ్లపై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఒక వందే భారత్ ట్రైన్‌కు అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఉదయ్‌పూర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత భిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు పేర్చి ఉండటాన్ని గమనించారు లోకో ఫైలట్. దీంతో.. వెంటనే రైలును ఆపేశారు. రైల్వే ఉద్యోగులు వాటిని తొలగించడానికి కిందకు దిగారు. రాళ్లు తొలగిస్తున్న క్రమంలో.. మరో షాకింగ్ విషయాన్ని వాళ్లు గుర్తించారు. రైలు ఆగిన చోటు నుంచి 10-15 అడుగుల దూరంలో పెద్ద రాళ్లను వరుసగా పేర్చారు. అంతేకాదు.. పట్టాలను కలిపే లింక్ వద్ద రెండు ఇనుప రాడ్లను కూడా ఇరికించారు. ఆ పెద్ద రాళ్లు కింద పడకుండా ఉండేందుకు.. అటు, ఇటు రెండు రాడ్లు అమర్చారు. ఒకవేళ ఇది గుర్తించకుంటే బహుశా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు రైల్వే అధికారులు. ప్రమాదం జరగాలన్న ఉద్దేశంతో ఈ రాళ్లను పక్కా ప్లానింగ్‌తో పేర్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ మొత్తం తతంగాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం.. అయితే ప్రమాదం ఏమీ చోటు చేసుకోకపోవడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ను ప్రధాని మోదీయే.. సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us