Jahnavi Death: జాహ్నవి మృతిపై నవ్వింది ఇందుకే.. అమెరికా పోలీసు వివరణ.
అమెరికాలో ఈ ఏడాది జనవరిలో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన తెలుగు విద్యార్ధిని మృతిపై పోలీసు అధికారి హాస్యాస్పదంగా మాట్లాడిన ఆడియో ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని భారత్ ఎంబసీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జాహ్నవి మృతిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు సదరు పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరర్.
అమెరికాలో ఈ ఏడాది జనవరిలో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన తెలుగు విద్యార్ధిని మృతిపై పోలీసు అధికారి హాస్యాస్పదంగా మాట్లాడిన ఆడియో ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని భారత్ ఎంబసీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జాహ్నవి మృతిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు సదరు పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరర్. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని ఆ పోలీసు అధికారి చెప్పారు. మరోవైపు, ఈ వివాదానికి కారణమైన అధికారికి సియాటెల్ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. తాజాగా ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చిందని తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ రాసిన లేఖను కూడా గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని అన్నారు. బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదని , తన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యిందని తెలిపారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని అడెరర్ తెలిపారు. మరోవైపు డేనియల్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్‌లైన్ పిటిషన్లు మొదలయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

