థార్‌ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??

|

Aug 21, 2023 | 9:56 PM

రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి పచ్చదనంతో కళకళలాడే రోజు దగ్గర్లోనే ఉంది! గువహటిలోని కాటన్‌ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన బీఎన్‌ గోస్వామి, పుణెలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థకు చెందిన పీవీ రాజేశ్‌ల నాయకత్వంలోని బృందం చెబుతున్న భవిష్యత్‌ ఇది. వీరి అధ్యయన ప్రకారం- వాతావరణ మార్పులు ప్రపంచమంతటా ఎడారుల విస్తరణకు దారితీస్తుంటే.. థార్‌ ఎడారిని మాత్రం వచ్చే శతాబ్దంలో పచ్చని ప్రాంతంగా మార్చేయనుంది.

రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి పచ్చదనంతో కళకళలాడే రోజు దగ్గర్లోనే ఉంది! గువహటిలోని కాటన్‌ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన బీఎన్‌ గోస్వామి, పుణెలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థకు చెందిన పీవీ రాజేశ్‌ల నాయకత్వంలోని బృందం చెబుతున్న భవిష్యత్‌ ఇది. వీరి అధ్యయన ప్రకారం- వాతావరణ మార్పులు ప్రపంచమంతటా ఎడారుల విస్తరణకు దారితీస్తుంటే.. థార్‌ ఎడారిని మాత్రం వచ్చే శతాబ్దంలో పచ్చని ప్రాంతంగా మార్చేయనుంది. రాజస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాల వరకు 2 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో థార్‌ ఎడారి విస్తరించి ఉంది. ప్రపంచంలోని 20వ అతిపెద్ద ఎడారి. కర్బన ఉద్గారాలు పెరగడంతో భూ ఉష్ణోగ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. భూతాపం వల్ల సహారా ఎడారి 2050 కల్లా ఏడాదికి 6,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి భిన్నంగా థార్‌లో వానలు కురిసి పంటలకు, అడవులకు అనువైన వాతావరణం ఏర్పడనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రోజు వధువుకి భారీ డిమాండ్‌ !! అక్కడ పురుషులు బ్రహ్మచారులుగా మరణించడం అశుభం

14 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు.. ఇది కదా కింగ్ కోబ్రా అంటే ??

టాయిలెట్‌లో ఇరుక్కున్న బాలిక కాలు.. చివరికి ??

500 మీటర్ల దూరం కారు బానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ !!

ఫ్రెండ్స్‌పైనే పెప్పర్ స్ప్రే … ట్రై చేసిన అమ్మాయిల సస్పెన్షన్

Follow us on