AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే

ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే

Phani CH
|

Updated on: Aug 10, 2025 | 4:21 PM

Share

పాములు పగబడతాయా అన్న విషయాన్ని పక్కన పెడితే.. పాము కారణంగా ఓ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదానికి పాము కారణమైంది. పాము రూపంలో వచ్చిన ప్రమాదం ఆ కుటుంబాన్ని నిరాశ్రయులను చేసింది.. బట్టల షాపు మొత్తం కాలి బూడిదైపోయింది.

పాము కరెంట్‌ స్తంభం ఎక్కడం.. విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌తో బట్టల దుకాణం కాలి బూడిదైపోవడం అంతా ఆ పాము పగవల్లే అంటున్నారు స్థానికులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్యక్తి మారుతి ఫ్యాషన్స్ పేరుతో ఓ బట్టలషాపు నిర్వాహిస్తున్నాడు . ఎప్పటిలాగే తన బట్టల షాప్ మూసేసిన తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు. అయితే సాయంత్రం వేల సమీపంలోని విద్యుత్ స్తంభంపైకి ఓ నాగుపాము ఎక్కింది. అది రెండు వైర్లను తాకడంతో షాక్‌ కొట్టి పాము కాలిపోయింది. ఈ క్రమంలో జే వైర్‌కు పాము చుట్టుకొని ఉండడంతో బట్టల షాప్‌లోని వైర్‌కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. షాప్ లోపల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులోని వస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షాపు దగ్ధమైంది. 14 ఏళ్ల కష్టార్జితం నాగుపాము రూపంలో కాలి బూడిదయిపోవడంతో ఆ కుటుంబం లబోదీబోమంటున్నారు. షాపులో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనేఅగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపుచేసే లోపే పూర్తిగా షాపు దగ్ధమైపోయింది. అందులోని వస్త్రాలు నగదు కాలి బూడిదయ్యాయి. షాపులో విద్యుత్ షాక్ సర్క్యూట్ ఎలా సంభవించింది అని పరిశీలిస్తే షాప్ ముందు స్తంభంపై ఉన్న పాము వారికి కనిపించింది. పాము పగ పట్టడం వల్ల ఇలా జరిగింది అని కొందరు స్థానికులు భావిస్తున్నారు.. షాప్ దగ్దం అయిపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్‌ రూల్

జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ

ఏడేళ్లలో 42 సార్లు ‘నో’ చెప్పింది 43వ సారి మాత్రం..

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. చివరకు..

Liver: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే