పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్ రూల్
మధ్యప్రదేశ్ ఇటీవల.. నో హెల్మెట్-నో పెట్రోల్ అనే నిబంధనను తెచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఇండోర్‌లో అమలులోకి తెచ్చారు. అయితే.. సర్కారు ఆదేశాలను సీరియస్‌గా తీసుకోని ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది.. హెల్మెట్ లేకుండా వచ్చిన ఒక పాలవ్యాపారి బండికి పెట్రోల్ కొట్టేశారు.ఈ విషయం అధికారుల నోటీసుకు రావటంతో.. ప్రభుత్వం ఆ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసేసింది.
మొత్తానికి ఓ పాలవ్యాపారి తొందరపాటు, పెట్రోలు బంకు సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా బంకు మూతపడింది. ఇండోర్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే నిబంధన అమలులోకి వచ్చింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వస్తే వారికి పెట్రోల్ పోయవద్దని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత బంక్‌లపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఇదివరకే హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే స్థానిక పాల వ్యాపారి ఒకరు తన బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు బంక్‌కు వచ్చాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆ విషయం బంకు వద్దకు వచ్చాక అతనికి తెలిసింది. వెంటనే ఓ ఐడియా వచ్చింది. పాల క్యానుపై ఉన్న మూతను తీసి హెల్మెట్‌గా పెట్టుకున్నాడు. బంక్‌లో పని చేసే వ్యక్తి అది గమనించకుండా పెట్రోల్ పోసేసాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ యువకుడు ఈ ఘటన మొత్తాన్ని తన సెల్ ఫోన్‌లో రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ
ఏడేళ్లలో 42 సార్లు ‘నో’ చెప్పింది 43వ సారి మాత్రం..
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. చివరకు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

