ఏడేళ్లలో 42 సార్లు ‘నో’ చెప్పింది 43వ సారి మాత్రం..
ప్రేమించడం ఒక ఎత్తయితే.. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లటం మరో ఎత్తు. చాలా వరకు ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోతుంటాయి. చాలా ప్రేమ జంటలు ఇంట్లో ఒప్పించే ధైర్యం చేయలేక.. ఏళ్ల తరబడి వెయిట్ చేయలేక విడిపోతూ ఉంటాయి. వేరే పెళ్లి చేసుకుంటూ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ఓ ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి, ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఏకంగా ఏడేళ్ల పాటు ఎదురు చూశాడు.
42 సార్లు ఆమె కాదన్నా ఎంతో ఓపిక పట్టి విజయం సాధించాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అమెరికాకు చెందిన 38 ఏళ్ల సారాకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమెకు ల్యూక్ తో పరిచయం అయింది. ఆరు నెలలు రిలేషన్‌లో ఉన్న తర్వాత తనను పెళ్లి చేసుకోమని ల్యూక్.. సారాను అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా పెళ్లంటేనే ఆమె భయపడింది. 2018 నుంచి ఇప్పటి వరకు అతను 42 సార్లు ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పింది. అతడిలో ప్రేమ, ఓపిక చావలేదు. మొన్నామధ్య మే నెలలో 43వ సారి ప్రయత్నించాడు. ఈ సారి ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ల్యూకో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మే 17వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సారా మాట్లాడుతూ..తను అతడ్ని ప్రేమించాననీ కానీ, పెళ్లికి మాత్రం ఎస్ చెప్పలేకపోయాననీ అంది. పిల్లల విషయంలో అంతా ఓకేనా కాదా? అని తను తెలుసుకోవాలని అనుకున్నాననీ అందుకే నో చెప్పాననీ అతడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా పెళ్లి ప్రపోజల్ తెస్తూనే ఉన్నాడు అని మీడియాతో చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. చివరకు..
Liver: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే
Jr NTR: వార్ 2 ను అందుకే అంగీకరించాను
Weather Alert: వెదర్ వార్నింగ్.. మూడు రోజులు భారీ వర్షాలు..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

