పసివాళ్ల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా నదిలో దూకాడు.. చివరికి ??

|

Jul 12, 2022 | 9:48 AM

అమెరికాలో ఉంటున్న ఈ టీనేజర్‌ పేరు కొరియన్ ఇవాన్స్‌ . ఓ పెద్ద సాహసమే చేశాడు. నదిలో చిక్కుకున్న ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు, ఓ పోలీస్ ఆఫీసర్‌ని ప్రాణాలతో కాపాడాడు.

అమెరికాలో ఉంటున్న ఈ టీనేజర్‌ పేరు కొరియన్ ఇవాన్స్‌ . ఓ పెద్ద సాహసమే చేశాడు. నదిలో చిక్కుకున్న ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు, ఓ పోలీస్ ఆఫీసర్‌ని ప్రాణాలతో కాపాడాడు. మిస్సిస్సిపీలో ఓ కారు హైవేపై వేగంగా దూసుకుపోతూ… పక్కనున్న పాస్కాగౌలా నదిలో పడిపోయింది. అది కొరియన్ చూశాడు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కళ్ల ముందే కారు నీటిలో మునిగిపోతూ ఉంది. చివరకు చిన్న పార్ట్ మాత్రమే నీటి పైన కనిపిస్తోంది. “జంప్” అంటూ వెంటనే నదిలోకి దూకాడు ఇవాన్స్. అదే ప్రేరణతో అతని ఫ్రెండ్ కూడా నదిలోకి దూకాడు. ఇద్దరూ కారు డోర్‌ తెరిచి అందులోని ముగ్గురు అమ్మాయిలనూ ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే… ఓ పోలీస్ ఆఫీసర్ నీటిలో మునిగిపోతూ కనిపించాడు. అతను ఆ అమ్మాయిల్ని కాపాడేందుకు వచ్చాడు. కానీ తనే మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అది చూసిన ఇవాన్స్… మరోసారి నదిలోకి దూకాడు. నీటిలో ఉన్న పోలీస్ ఆఫీసర్‌ గ్యారీ మెర్సెర్‌ని ఎలాగొలా ఒడ్డుకు తెచ్చాడు. ఆ తర్వాత ఆఫీసర్‌నీ, బాలికల్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.. లోకేశ్‌ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా

వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటున్న నెటిజనం

Viral: ప్రేమ కోసం బెట్‌ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌ తో.. !!

Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే

ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

 

Published on: Jul 12, 2022 09:48 AM