‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.. లోకేశ్‌ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా

‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.. లోకేశ్‌ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా

Phani CH

|

Updated on: Jul 12, 2022 | 9:46 AM

విశ్వనటుడు కమల్‌హాసన్ , పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హైఓల్జేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌. తాజాగా ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియోని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

విశ్వనటుడు కమల్‌హాసన్ , పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హైఓల్జేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌. తాజాగా ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియోని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఫహాద్‌ ఫాజిల్‌ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ మేకింగ్‌ వీడియో కమల్‌హాసన్‌ , విజయ్‌సేతుపతి సీన్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కొనసాగింది. ముఖ్యంగా కమల్‌ లుక్, డ్రెస్సింగ్‌ స్టైల్‌‌.. ఇలా ప్రతి చిన్న విషయంలో దర్శకుడు లోకేశ్‌ తీసుకున్న జాగ్రత్తలను ఈ వీడియోలో చూడొచ్చు. యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆయన లుక్‌కు లోకేశ్‌ తుది మెరుగులు అద్దుతూ కనిపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ లోకేశ్‌ ఫోకస్‌కు ఫిదా అవుతున్నారు. లోకేశ్‌ని మెచ్చుకుంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘‘లోకేశ్‌ సర్‌.. ప్రతిఫ్రేమ్‌లోనూ మీ ఫోకస్‌ అదిరిపోయింది’’, ‘‘ప్రతి సీన్‌ని తెరకెక్కించడంలో మీ టీమ్‌ పడిన కష్టం తెలుస్తోంది’’ అంటూ మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటున్న నెటిజనం

Viral: ప్రేమ కోసం బెట్‌ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌ తో.. !!

Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే

ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది

 

Published on: Jul 12, 2022 09:46 AM