సరిగ్గా ఆ టైమ్‌కే వీడియో ఎందుకు తీసావ్?17 ఏళ్ల బాలుడికి వేధింపులు? వీడియో
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఇందుకు సంబంధించిన తొలి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు దర్యాప్తు సంస్థల దృష్టిలో పడింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియోను చిత్రీకరించిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఓ 17 ఏళ్ల బాలుడు. అతనే ఆర్యన్ అసరి. 12వ తరగతి చదువుతున్న ఆర్యన్, ప్రమాదానికి రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని మేఘానినగర్లో ఉంటున్న తన తండ్రిని కలిసి 11 వ తరగతి పుస్తకాలు కొనుక్కోవడానికి తన గ్రామం నుండి వచ్చాడు.
ప్రమాదం జరిగిన సమయంలో, అతను తన తండ్రి అద్దెకు ఉంటున్న ఇంటి పైకప్పుపై ఉన్నాడు. తండ్రి వద్దకు వచ్చినప్పటి నుంచి ఖాళీ సమయంలో ఆర్యన్.. భవనం మీదికి వెళ్లి.. ఆ పక్కనే ఉన్న విమానాశ్రయం నుంచి ఎగురుతున్న విమానాలను వీడియో తీసేవాడు. వేసవి సెలవుల తర్వాత తమ ఊరికి వెళ్లాక.. అక్కడి తన స్నేహితులకు వాటిని చూపించాలని ఆర్యన్ అనుకున్నాడు. జూన్ 12 న కూడా అలా వీడియో తీస్తుండగా, డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అవుతూనే కుప్పకూలిపోయింది. వీడియో రికార్డు మొదలుపెట్టిన 14 సెకన్లకే విమానం అసాధారణంగా కుదుపులకు లోనైందని, తరువాత పెద్ద పేలుడు సంభవించి కుప్పకూలిందని ఆర్యన్ తెలిపాడు. ఆ ఘటనను కళ్లారా చూసి ఎంతో భయపడ్డాననీ వీడియోను మొట్టమొదట తన సోదరికి చూపించగా, ఆమె తమ తండ్రికి చూపిందని వెల్లడించాడు. విమానం అలా కూలిపోతుందనే విషయం తనకు తెలియదని ఆర్యన్ తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం :
మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!
ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!
ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ ..ఆనందంలో సమంత వీడియో
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
