Viral Video: ఇదెక్క‌డి క్రేజ్ సామీ.. ఖండాంత‌రాలు దాటిన పుష్ప సామీ సామీ పాట‌.. వైర‌ల్ వీడియో..

|

Jan 11, 2022 | 5:53 AM

Viral Video: సంగీతానికి భాష, ప్రాంతంతో సంబంధం లేదంటారు. మ‌న‌కు తెలియ‌ని, అర్థంకాని భాష‌లోని పాట‌లు సైతం మ‌న‌కు న‌చ్చ‌డమే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ చెప్ప‌వ‌చ్చు. అయితే ఓ తెలుగు పాట‌కు...

Viral Video: ఇదెక్క‌డి క్రేజ్ సామీ.. ఖండాంత‌రాలు దాటిన పుష్ప సామీ సామీ పాట‌.. వైర‌ల్ వీడియో..
Follow us on

Viral Video: సంగీతానికి భాష, ప్రాంతంతో సంబంధం లేదంటారు. మ‌న‌కు తెలియ‌ని, అర్థంకాని భాష‌లోని పాట‌లు సైతం మ‌న‌కు న‌చ్చ‌డమే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ చెప్ప‌వ‌చ్చు. అయితే ఓ తెలుగు పాట‌కు ఇత‌ర దేశాల్లో క్రేజ్ ద‌క్కితే ఎలా ఉంటుంది.? విన‌డానికే ఆస‌క్తిగా ఉంది క‌దూ..! కానీ ప్ర‌స్తుతం ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైర‌ల్‌గా మారింది. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఎంత‌లా ఫిదా అయ్యారో పాట‌ల‌కు కూడా అదే స్థాయిలో ఫిదా అయ్యారు. ముఖ్యంగా ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌గా చిత్రీక‌రించిన సామీ సామీ పాట ట్రెండింగ్‌లో నిలిచింది.

సామాన్యుల‌తో పాటు సెల‌బ్రీటీలు కూడా ఈ పాట‌కు రీల్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ పాట క్రేజ్ ఇండియాతోనే ఆగిపోలేదు విదేశాల‌కు కూడా వ్యాపించింది. ఏకంగా టాంజానియా దేశంలో సామి సామి పాట‌కు స్టెప్పులు వేశారు. టాంజానియాకు చెందిన కిలిపాల్ అనే కంటెంట్ క్రియేట్ సామి సామి పాట‌కు స్టెప్పులేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌క్క‌ర్లు కొడుతోంది. కిలిపాల్‌ ఈ వీడియోతోపాటు తెలుగు, పుష్ప‌, టాలీవుడ్‌, అల్లు అర్జున్‌, ర‌ష్మికా, పేర్ల‌ను ట్యాగ్ చేస్తూ.. సామి సామి ఇప్పుడు ఇండియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది అన్న అర్థం వ‌చ్చేలా కామెంట్ చేయ‌డం విశేషం.

ఇదిలా ఉంటే కిలిపాల్ ఇండియ‌న్ పాట‌ల‌కు కాలు క‌ద‌ప‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా చాలా బాలీవుడ్ చిత్రాల‌కు డ్యాన్స్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుంటాడు. టాంజానియాలోని మారు మూల ప్రాంతంత‌లో ఉండే కిలిపాల్ త‌న సంప్ర‌దాయ వేషాధార‌ణ‌లో వేసే స్టెప్పులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. కిలిపాల్‌ను సుమారు 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఫాలో అవుతుండం విశేషం. ఇత‌నికి సంబంధించిన మ‌రికొన్ని వీడియోలు ఇక్క‌డ చూడండి..

Also Read: Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక !! క్షణాల్లో మంచుగడ్డలా !! వీడియో

Punjab Election 2022: పంజాబ్‌ నుంచి పోటీ రెడీ అవుతున్న సోనూ సూద్ సోదరి.. ఏ పార్టీ నుంచో తెలుసా..

Rakul Preet Singh : అవును అతనితో ప్రేమలో ఉన్నా.. క్లారిటీ ఇచ్చిన పాలబుగ్గల సుందరి రకుల్..