Punjab Election 2022: పంజాబ్‌ నుంచి పోటీ రెడీ అవుతున్న సోనూ సూద్ సోదరి.. ఏ పార్టీ నుంచో తెలుసా..

Punjab Assembly Election 2022: బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోనూసూద్ నివాసానికి చేరుకున్నారు. సిద్ధూ, సూద్‌ల భేటీకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి పార్టీ కండువ కప్పుకున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని సూద్ నివాసంలో మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక […]

Punjab Election 2022: పంజాబ్‌ నుంచి పోటీ రెడీ అవుతున్న సోనూ సూద్ సోదరి.. ఏ పార్టీ నుంచో తెలుసా..
Sonu Soods Sister Malvika Sood Joins Congress
Sanjay Kasula

|

Jan 10, 2022 | 9:17 PM

Punjab Assembly Election 2022: బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోనూసూద్ నివాసానికి చేరుకున్నారు. సిద్ధూ, సూద్‌ల భేటీకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి పార్టీ కండువ కప్పుకున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని సూద్ నివాసంలో మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక ప్రవేశాన్ని చన్నీ ప్రశంసించారు. ఫిబ్రవరి 14 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామాన్ని సిద్ధూ “గేమ్ ఛేంజర్”గా అభివర్ణించారు.  మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాళవిక పోటీ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు జవాబు దాటవేశారు. ఇంత మంచి కుటుంబం మా పార్టీకి రావడం అదృష్టమన్నారు. ఆమె చదువుకున్న మహిళ అంటూ ప్రశంసించారు చన్నీ.

ఎన్జీవో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువతి మా పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని సిద్ధూ మాళవిక కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికారు. మోగాలో ఉన్న సోనా సూద్, తన సోదరి గతంలో చాలా మంచి పనులు చేశారని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో తన సోదరి రాజకీయాల్లో చేరనున్నట్లు నటుడు ప్రకటించారు.

మాళవిక సూద్ కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రస్తావిస్తూ, సిద్ధూ, “క్రికెట్ ప్రపంచంలో దీనిని గేమ్ ఛేంజర్ అంటారు. ఆమె యువకురాలు, చదువుకున్న మహిళ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆమె విద్య ఆమెకు తదుపరి జీవితంలో సహాయపడుతుంది. ”అని సిద్ధూ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మాళవిక అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu