Rajinikanth: వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.

|

Dec 11, 2023 | 10:21 AM

మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినా నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొరత, కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు.

మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినా నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొరత, కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు.

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రజినీకాంత్‌ ఇంటి వద్ద వరదనీటికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు వరద బాధితులకు రజనీకాంత్ 10 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. నటులు సూర్య, ఆయన సోదరుడు కార్తీ కూడా 10 లక్షలు విరాళంగా అందజేశారు. పలువురు సినీ తారలు వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యావసరాలు వంటి సాయం అందజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.