Tallest Temple: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎత్తైన ఆలయం నిర్మాణం.. ఎక్కడంటే..?
ప్రపంచలోనే అత్యంత ఎత్తైన ఆలయం మన దేశంలో నిర్మితమవుతోంది. గుజరాత్లోని జస్పూర్ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 504 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి సుమారు వెయ్యికోట్లు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని భక్తులకు అందుబాటులోకి..
ప్రపంచలోనే అత్యంత ఎత్తైన ఆలయం మన దేశంలో నిర్మితమవుతోంది. గుజరాత్లోని జస్పూర్ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 504 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి సుమారు వెయ్యికోట్లు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. విశ్వ ఉమియా ధామ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. తాజాగా పాటీదార్ సమాజానికి చెందిన ట్రస్టు సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఆలయ నిర్మాణశైలిపై చర్చించారు. ఈ ఆలయ ఆవరణలో అతిపెద్ద ట్రీ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు 597 అడుగులు. 96 అడుగులు తక్కువగా 501 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆలయంలో భూకంపాలు, వరదలను సైతం తట్టుకునేలా ఇండో-జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ ఆలయంలోని 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...