గర్భగుడిలోని శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు !!

|

Sep 26, 2023 | 9:57 AM

హనుమకొండలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని శివలింగాన్ని భానుడి లేలేత కిరణాలు స్పృశించాయి. ఏడాదిలో రెండుసార్లు ఈ అద్భుతం కనువిందుచేస్తుంది. అదికూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే జరగడం విశేషం. అదంతా పరమశివుని మహత్మ్యయంగా భావిస్తున్నారు భక్తులు. కిరణాల రూపంలో నారాయణుడిని, లింగరూపంలో శివుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

హనుమకొండలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని శివలింగాన్ని భానుడి లేలేత కిరణాలు స్పృశించాయి. ఏడాదిలో రెండుసార్లు ఈ అద్భుతం కనువిందుచేస్తుంది. అదికూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే జరగడం విశేషం. అదంతా పరమశివుని మహత్మ్యయంగా భావిస్తున్నారు భక్తులు. కిరణాల రూపంలో నారాయణుడిని, లింగరూపంలో శివుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. హనుమకొండలో స్వయంభువుగా పూజలందుకుంటున్న సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఈరోజు ఉదయం గుడి ఎదురుగా ఉండే నందిమండపం, 3 ప్రధాన ద్వారాలను దాటుకొని గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఇలా శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడం వల్ల శివకేశవుల ప్రభావంతో మరింత శక్తివంతమవుతుందని చెబుతారు. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించుకొని, భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు

చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!

పాఠాలు చెప్పాల్సిన టీచర్‌ క్లాస్‌ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్‌ చేసిన స్థానికులు

మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్

Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి