పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
సాధారణంగా క్లాస్ రూమ్‌లో విద్యార్ధులు కునుకు తీస్తుండటం మనం చూస్తుంటాం. టీచర్లు చెప్పే పాఠాలు జోలపాటలా వినిపించడంతో విద్యార్ధులు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వీడియోలు కూడా ఇటీవల నెట్టింట చేరి నెటిజన్లను అలరిస్తుంటాయి. తాజాగా అలాంటి ఇంకో వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్లాస్‌లో నిద్రపోతున్నది విద్యార్ధులు కాదు.. పాఠాలు చెప్పాల్సిన టీచర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సాధారణంగా క్లాస్ రూమ్‌లో విద్యార్ధులు కునుకు తీస్తుండటం మనం చూస్తుంటాం. టీచర్లు చెప్పే పాఠాలు జోలపాటలా వినిపించడంతో విద్యార్ధులు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వీడియోలు కూడా ఇటీవల నెట్టింట చేరి నెటిజన్లను అలరిస్తుంటాయి. తాజాగా అలాంటి ఇంకో వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్లాస్‌లో నిద్రపోతున్నది విద్యార్ధులు కాదు.. పాఠాలు చెప్పాల్సిన టీచర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెహోర్ జిల్లా మోగ్రా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ధరమ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను స్కూలుకి రాగానే విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సింది పోయి క్లాస్‌రూమ్‌లోనే పడకేసి ముసుగుతన్ని పడుకున్నాడు. విద్యార్ధులను బయట ఆడుకోమని పంపించేసి క్లాస్‌లో నిద్రపోయాడు. దాంతో విద్యార్ధులు ఆటల్లో మునిగిపోయారు. టీచర్ చక్కగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఇతడి నిర్వాకం చూసి షాక్ అయిన కొందరు.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు సదరు ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇలాంటి టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరంటే.. మరికొందరు అతని తీరుపై ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్
Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి
గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??
ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు
తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

