ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు

ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు

Phani CH

|

Updated on: Sep 26, 2023 | 9:50 AM

గణపతి నవరాత్రులంటే చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. వీధులన్నీ గణపతి మండపాలతో సందడిగా ఉంటాయి. భక్తులు, పూజలు.. రకరకాల ప్రసాదాలు సందడే సందడి... ఇక నిమజ్జనం రోజు ఊరేగింపు నెక్ట్స్‌ లెవల్‌గా ఉంటుంది. డాన్సులు.. డీజే లు..చిందులు.. రంగుల్లో మునిగి తేలుతారు. డాన్సుల వరకూ అయితే ఫరవాలేదు. కొందరు ఈ వేడుకల్లో విన్యాసాలు చేస్తారు. అవి ఒక్కోసారి బెడిసికొట్టి ప్రమాదాల్లో పడుతుంటారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో అదే జరిగింది.

గణపతి నవరాత్రులంటే చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. వీధులన్నీ గణపతి మండపాలతో సందడిగా ఉంటాయి. భక్తులు, పూజలు.. రకరకాల ప్రసాదాలు సందడే సందడి… ఇక నిమజ్జనం రోజు ఊరేగింపు నెక్ట్స్‌ లెవల్‌గా ఉంటుంది. డాన్సులు.. డీజే లు..చిందులు.. రంగుల్లో మునిగి తేలుతారు. డాన్సుల వరకూ అయితే ఫరవాలేదు. కొందరు ఈ వేడుకల్లో విన్యాసాలు చేస్తారు. అవి ఒక్కోసారి బెడిసికొట్టి ప్రమాదాల్లో పడుతుంటారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో అదే జరిగింది. వినాయకుడి ఊరేగింపుకోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ మీదనుంచి దూకి స్టంట్‌ చేసాడు ఓ వ్యక్తి. మరుక్షణం అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అసలేం జరిగిందంటే.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని జీప్ స్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపంలో వైభవంగా ఉత్సవాలు, పూజలు నిర్వహించారు. ఏడోరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. విగ్రహాన్ని ట్రాక్టర్లో పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ రంగులు చల్లుకుంటూ డాన్సులు వేసుకుంటూ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కిరణ్‌ అనే యువకుడు స్టంట్‌ చేసి అందరినీ అలరించాలనుకున్నాడు. విగ్రహాన్ని తీసుకెళుతున్న సమయంలో ఓ పెద్ద ఆపశృతి చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్ బంపర్ పైనుంచి పల్టీ కొట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు