Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్

మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి మైండ్‌బ్లాక్

Phani CH

|

Updated on: Sep 26, 2023 | 9:53 AM

గత కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలస్తుంది. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక రకాల వార్తలు అటు ఇంటర్‌ నెట్‌లోనూ వైరల్‌ అవుతున్నాయి. మెట్రో రైలులో గొడవలు, కుమ్ములాటలు, ఆడవాళ్ల సిగపట్లు, యువతీ యువకుల రోమాన్స్‌కు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఇప్పటి వరకు మనం చూశాం. అయితే, ఈసారి ఓ కుర్రాడు లైకులు, షేర్స్ కోసం వీడియో తీస్తూ.. నవ్వులపాలయ్యాడు.

గత కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలస్తుంది. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక రకాల వార్తలు అటు ఇంటర్‌ నెట్‌లోనూ వైరల్‌ అవుతున్నాయి. మెట్రో రైలులో గొడవలు, కుమ్ములాటలు, ఆడవాళ్ల సిగపట్లు, యువతీ యువకుల రోమాన్స్‌కు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఇప్పటి వరకు మనం చూశాం. అయితే, ఈసారి ఓ కుర్రాడు లైకులు, షేర్స్ కోసం వీడియో తీస్తూ.. నవ్వులపాలయ్యాడు. అతడి ఫెల్యూర్‌ను కూడా వీడియో తీసిన మరో యూజర్ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు అది శరవేగంగా షేర్ అవుతూ విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఢిల్లీ మెట్రో లోపల ఒక వ్యక్తి బ్యాక్‌ఫ్లిప్ చేయబోయి బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మెట్రోలో తోటి ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి బ్యాక్‌ఫ్లిప్ చేసేందుకు రెడీ అయ్యాడు. మెట్రో ట్రైన్‌లోపల ఖాళీ స్థలం చూసుకుని.. తన ప్రదర్శనకు ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించుకున్నాడు. సరైన యాంగిల్‌ చూసుకుని బ్యాక్‌ప్లిప్‌ ప్రయత్నించాడు. కానీ, పాపం అతడు పట్టు కోల్పోయాడు..దాంతో బలంగా కిందపడిపోయాడు.. మాడుకు భరించలేని దెబ్బ తగిలినట్టు అతడు పడుతున్న ఇబ్బంది చూస్తే అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మెట్రోలో ఇలాంటి చిత్ర విచిత్ర స్టంట్‌లు, రీల్స్‌ చేయడం, వీడియోలను నిషేధిస్తూ.. ఢిల్లీ మెట్రో కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ ఇలాంటి వాళ్లు చాలా మంది సోషల్ మీడియా యూజర్లు వీడియోలు, రీల్స్‌ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి

గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??

ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు

తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు