Lion On Road: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు సడెన్‌గా ఎదురుపడ్డ సింహం.. గుండె ఆగినంత పనైంది.. ! వైరల్ వీడియో
గ్రామాల మీదుగా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే అడవుల పక్కన గ్రామాల్లో ఎప్పుడూ చూడని క్రూర మృగాలు ఒకేసారి కళ్లముందు ప్రత్యక్షమైతే ఎవరికైనా సరే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా అలాంటి భయంకరమైన ఎక్స్ పీరియన్స్ ఇద్దరు వ్యక్తులకు ఎదురైంది.
గ్రామాల మీదుగా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే అడవుల పక్కన గ్రామాల్లో ఎప్పుడూ చూడని క్రూర మృగాలు ఒకేసారి కళ్లముందు ప్రత్యక్షమైతే ఎవరికైనా సరే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా అలాంటి భయంకరమైన ఎక్స్ పీరియన్స్ ఇద్దరు వ్యక్తులకు ఎదురైంది. గుజరాత్ లో ఓ గ్రామం మీదుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ప్రయాణిస్తున్నారు. ఆ రహదారి వెడల్పు తక్కువగా ఉంది. దీంతో రైడర్ మెల్లగా నడుపుతూ ముందుకు వెళ్తున్నాడు. అంతలోనే చెట్ల పొదల్లో నుంచి ఒక పెద్ద ఆడ సింహం బయటకు వచ్చింది.సడన్‌గా ఎదురైన సింహం చూసి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కూడా షాక్ అయ్యారు. అది తమ వైపు ముందుకు వస్తుంటే ఏం చేయాలో తెలియక దేవుడిపైనే భారం వేశారు. అయితే అనూహ్యంగా ఆ ఆడ సింహం వారిపై అటాక్ చేయలేదు. అది వీళ్లని చూసి చూడనట్టుగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో బతుకుజీవుడా అంటూ వాళ్లు అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ వీడియోని ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేయగా 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

