టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని.. బోరుమన్న విద్యార్థులు

|

Jul 02, 2024 | 10:28 PM

తమ ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. మసన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. ఇక తిరిగి రాడని, మళ్లీ ఆ సారు పాఠాలు వినలేమని ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు. స్కూల్‌ వదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు. జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో సీన్ ఇది. సుధీర్ సర్ ట్రాన్సఫర్ అవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు స్టూడెంట్స్. పసి హృదయాలతో గుండెలు పిండేశారు.

తమ ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. మసన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. ఇక తిరిగి రాడని, మళ్లీ ఆ సారు పాఠాలు వినలేమని ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు. స్కూల్‌ వదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు. జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో సీన్ ఇది. సుధీర్ సర్ ట్రాన్సఫర్ అవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు స్టూడెంట్స్. పసి హృదయాలతో గుండెలు పిండేశారు. తమ సుధీర్ సర్‌.. తమకిక పాఠాలు బోధించడని తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారుల ప్రేమకు ఉప్పొంగిపోయిన టీచర్.. మళ్లీ వస్తా కన్నీళ్లు పెట్టుకోవద్దని సముదాయించి, బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు టీచర్. శామీరపేటలోని ఉన్నత పాఠశాలలో కొంతకాలంగా పని చేస్తున్న సుధీర్‌రెడ్డి, ఫాతిమీ మేరీ అనే ఉపాధ్యాయులు బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో చివరిరోజు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు కన్నీరుమన్నీరయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా ??

వాహనదారులకు స్పూర్తిగా నిలుస్తున్న ఆవు.. ఏం చేసిందంటే ??

అయ్యోరామా.. థాంక్యూ చెప్తే విమానం ఎక్కనివ్వారా ??

రాత్రి వేళ పండ్లు తింటున్నారా ?? జాగ్రత్త.. ఆ ఫ్రూట్స్ తింటే డేంజర్ !!

మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలుంటే ఈ కూరగాయను అస్సలు తినొద్దు

Follow us on