చోరీకి గురైన బైక్.. కొన్ని రోజులు తర్వాత ఇంటి ముందు ప్రత్యక్షం.. అందులో ఓ లేఖ.. వీడియో

Updated on: Mar 03, 2025 | 2:12 PM

ఇంటి ముందు పార్క్‌ చేసిన వాహనాలు చోరీకి గురవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా చోరీకి గురైన వాహనం కొన్నాళ్ల తర్వాత మళ్లీ మన ఇంటిముందు ప్రత్యక్షమైతే ఎలాఉంటుంది.. ఓసారి ఊహించుకోండి. సరిగ్గా అలాగే జరిగింది తమిళనాడు శివగంగ జిల్లాలో. తిరుప్పువనమ్ ప్రాంతానికి సమీపంలోని డి. పళయ్యూర్ గ్రామంలో వీరమణి అనే వ్యక్తి తన బైక్‌ను ప్రతిరోజూ ఇంటి ముందు పార్క్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ రోజు అతని ద్విచక్రవాహనాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి పార్క్‌ చేసిన బండి ఉదయం చూసేసరికి మిస్‌. దాంతో అన్నిచోట్లా వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో బైకును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని నిర్ధారించుకుని తిరుప్పువనం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన తిరుప్పువనం పోలీసులు.. గాలింపు చేపట్టారు. అయినా బండి ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో ఊహించని విధంగా ఫిబ్రవరి 24న రాత్రి వీరమణి ఇంటి ముందు అతని బైక్ ప్రత్యక్షమైంది. బైక్ వద్ద ఓ లేఖ కూడా ఉంది. ఈ విషయాన్ని వీరమణి వెంటనే తిరుప్పువనం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ లేఖను చదివి ఆశ్చర్యపోయారు. అందులో తాను మరో ప్రాంతం నుంచి వస్తుండగా.. నాలుగు లేన్ల రహదారి సమీపంలో తనకు ఓ సమస్య ఎదురైందని, తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆ వీధి గుండా వెళ్తుండగా అక్కడ బైక్ కనిపించిందని రాసాడు. ఆ సమయంలో అవసరం కోసం ఆ బైక్ తీసుకెళ్లడం తప్పు అనిపించలేదని,ఆ తర్వాత అలా చేయడం తనకు బాధ కలిగించిందని లేఖలో పేర్కొన్నాడు. అందుకే 450 కిలోమీటర్లు తిరిగి ప్రయాణించి బైక్ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని, అత్యవసర పరిస్థితుల్లో మీ బైక్ నాకు ఎంతో సహాయం అందించింది.. అందుకు రుణపడి ఉంటాను అని రాసాడు. అంతేకాదు, బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో రూ. 1500 పెట్టానని, వాటిని తీసుకుని తనను క్షమించమని లేఖలో కోరాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్‌!వీడియో

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో

 గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో