Ramadan: రంజాన్‌ జోష్‌.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌..

రంజాన్‌ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్‌ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్‌ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్‌ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటుంది.

Ramadan: రంజాన్‌ జోష్‌..  అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌..

|

Updated on: Apr 11, 2023 | 9:34 AM

రంజాన్‌ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్‌ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్‌ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్‌ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్‌ వాడతారు. అత్తర్‌ తయారీ విధానం చూసినట్లయితే .. గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొగలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్‌ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని దేకిసాలలో వేస్తారు. దేకిసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు అత్తర్‌. చలి కాలంలో షామతుల్ అమ్, హ్రీనా, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటి అత్తర్లు వాడితే ఒంటికి వెచ్చదనం లభిస్తుంది. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మా, షాజహాన్, మన్నా, నాయబ్, హుప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమతుల్ అంబర్, హీనా, జాఫ్రత్, దహనుల్ ఊద్ వంటి అత్తర్లు వేసవిలో చల్లదనం పంచుతాయి. వీటిని వాడే కస్టమర్లు ప్రత్యేకించి తెప్పించుకోవడం, తయారు చేయించుకోవడం కూడా జరుగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్‌ !!

Ram Gopal Varma: వర్మ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటున్న నెటిజన్స్

Samantha: అల్లు అర్జున్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Secunderabad Railway Station: మారనున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూపు రేఖలు.. వీడియో లో చూసేయ్యండిలా

Follow us