SpaceX capsule: ఆకాశం నుంచి ఒక్కసారిగా పొలంలో పడ్డ వింత ఆకారం.. రైతు షాక్‌..! స్పేస్‌ ఎక్స్ క్యాప్సూల్‌గా..

ఓ రైతు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఓ పెద్ద నల్లని వస్తువు పడటం చూసి ఆ రైతు హడలిపోయాడు. దాంతో ఇక పొలం

SpaceX capsule: ఆకాశం నుంచి ఒక్కసారిగా పొలంలో పడ్డ వింత ఆకారం.. రైతు షాక్‌..! స్పేస్‌ ఎక్స్ క్యాప్సూల్‌గా..

|

Updated on: Aug 15, 2022 | 8:42 PM


ఓ రైతు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఓ పెద్ద నల్లని వస్తువు పడటం చూసి ఆ రైతు హడలిపోయాడు. దాంతో ఇక పొలం వద్దకు వెళ్లనంటే వెళ్లనని డిసైడైపోయాడు. అంతేకాదు.. పొలంలో కనిపించిన వింత ఆకారం గురించి చుట్టుపక్కన వారందరికీ చెప్పాడు. అదికాస్తా అధికారుల వరకు వెళ్లింది. దాంతో వారు.. ఆ పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా షాక్ అయ్యారు. అది ‘స్పేస్ ఎక్స్’ క్యాప్సూల్ శకలంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ సమీపంలోని గ్రామీణ రైతు మిక్ మైనర్స్ పొలంలో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ భాగం ఆకాశం నుంచి పడింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, జూన్ 9 న ఒక ముక్క పడిపోయింది. కొన్ని రోజుల తరువాత దీనిని రైతు గుర్తించాడు. ఈ ముక్క దాదాపు 3 మీటర్ల పొడవు, 20 నుంచి 30 కిలోల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని మౌంట్ స్ట్రోమ్లో అబ్జర్వేటరీలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ టక్కర్ అవశేషాలను పరిశీలించారు. సాధారణంగా ఇటువంటి శిధిలాలు సముద్రంలో పడతాయని, భూమిపై చాలా అరుదుగా పడతాయని తెలిపారు. కాగా, రైతు పొలం దగ్గర జరిపిన సోదాల్లో మరో రెండు అవశేషాలు లభ్యమయ్యాయని చెప్పారు. ప్రజలకు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us