Bachelors: పెళ్లి అంటే పారిపోతున్న యూత్.. కారణం తెలిస్తే షాక్.! వైరల్ అవుతున్న వీడియో..
సౌత్ కొరియా కొత్త సమస్యలో చిక్కుకుంది. అక్కడ యువత పెళ్లి అంటేనే భయపడుతున్నారు. వివాహం జోలికి వెళ్లడం లేదు. కుటుంబ జీవనం అంటేనే అక్కడి యువత ఆందోళన చెందుతున్నారు.
సౌత్ కొరియా కొత్త సమస్యలో చిక్కుకుంది. అక్కడ యువత పెళ్లి అంటేనే భయపడుతున్నారు. వివాహం జోలికి వెళ్లడం లేదు. కుటుంబ జీవనం అంటేనే అక్కడి యువత ఆందోళన చెందుతున్నారు. మరో 30 ఏళ్లలో దేశంలో సగం జనాభా పెళ్లి చేసుకోని వారే ఉంటారంట. ఈ విషయం ఆ దేశానికి చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశంలో 72 లక్షల మంది యువతీ యువకులు సింగిల్‌గా ఉన్నారు. ఈ సంఖ్య కొరియాలోని మొత్తం కుటుంబాల్లో మూడో వంతు. అంతేకాదు మరో 30 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సర్వే ప్రకారం 2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఇద్దరు సింగిల్స్ ఉంటారంట. మరో విశేషమేమంటే ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా దేశం కూడా ఒకటి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం బ్యాచిలర్ జనాభా 15.5 శాతంగా ఉండేది. క్రమక్రమంగా ఇది 30 శాతానికి చేరింది. ఇదే తంతు కొనసాగితే 2050 నాటికి 40 శాతానికి చేరుకుంటుందని సర్వేలో తేలింది. యువతలో ఎక్కువ శాతం మంది కుటుంబ జీవనానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని సర్వే తేల్చింది. దీంతో ఆ దేశంలో రాబోయే రోజుల్లో సంతానోత్పత్తి మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

