Crocodile Dressed: మొసలి వేషంలో, అసలైన మొసలిని .. ఆటపట్టించబోయాడు.. ఏమైందంటే..?
మొసలి వేషం వేసిన ఒక వ్యక్తి నిజమైన మొసలిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి దగ్గరకు వెళ్లి దాని కాళ్లు పట్టుకుని మూడు నాలుగు సార్లు లాగాడు.
మొసలి వేషం వేసిన ఒక వ్యక్తి నిజమైన మొసలిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి దగ్గరకు వెళ్లి దాని కాళ్లు పట్టుకుని మూడు నాలుగు సార్లు లాగాడు. అయితే ఆ మొసలి పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు చేసిన ప్రమాదకర టీజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నది ఒడ్డున ఒక మొసలి ఉంది. మొసలి వేషం ధరించిన ఒక వ్యక్తి మెల్లగా ఆ మొసలి సమీపానికి వెళ్లాడు. తన చేతులతో దాని కాలిని పట్టుకుని లాగుతూ ఆటపట్టించాడు. నరేంద్ర సింగ్ అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో గురువారం పోస్ట్ చేశారు. ‘అతడు ఏం డ్రగ్స్ తీసుకున్నాడు?’ అని ఈ వీడియోకు శీర్షిక పెట్టారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ వీడియో చూసి షాకైనట్లు పలువురు పేర్కొన్నారు. ధైర్యం, మూర్ఖత్వం మధ్య సన్నని రేఖ ఉంటుందని ఒకరు విమర్శించారు. చనిపోవడానికి ఇదొక సృజనాత్మక మార్గం అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఆ మొసలి నోట కరుచుకుని నీటిలోకి తీసుకెళ్లే వరకే ఈ వినోదాలు, ఆటలు’ అంటూ మరో యూజర్ మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

