ఏటీఎం దగ్గర గంటలు తరబడి నిల్చున్న వ్యక్తి.. దగ్గరి కెళ్లి టచ్‌ చేయగా షాక్‌

|

Oct 09, 2022 | 9:59 AM

అప్పుడప్పుడు ఏటీఎం సెంటర్ల వద్ద క్యూ ఉంటుంది. ముఖ్యంగా నెల ఆరంభంలో డబ్బులు విత్‌ డ్రా చేయడానికి లేదా డిపాజిట్‌ చేయడానికి చాలామంది ఏటీఎం సెంటర్లకు పరుగులు తీస్తుంటారు.

అప్పుడప్పుడు ఏటీఎం సెంటర్ల వద్ద క్యూ ఉంటుంది. ముఖ్యంగా నెల ఆరంభంలో డబ్బులు విత్‌ డ్రా చేయడానికి లేదా డిపాజిట్‌ చేయడానికి చాలామంది ఏటీఎం సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఏటీఎం కార్డుల వివరాలు, పాస్‌వర్డ్స్‌ గోప్యంగా ఉంచుకోవాలి. ఇతరులకు తెలియకూడదు. ఈ కారణంగానే ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా ఉంటే వేరొకరు లోనికి వెళ్లరు. వారు తిరిగి బయటకు వచ్చేవరకు అక్కడే ఆగిపోతారు. అయితే యూకేలోని ఒక ఏటీఎం వద్ద ఒక వ్యక్తి గంటల తరబడి నిల్చొని ఉన్నాడు. ఎంతకీ కదల్లేదు. మరోపక్క జనాలతో క్యూ పెరిగిపోతుంది. దీంతో ఓపిక నశించిన ఒక వ్యక్తి కోపంతో ఏటీఎం దగ్గరకు వచ్చి నిల్చొన్న వ్యక్తిని చేత్తో తట్టాడు. అయినా ఎటువంటి కదలిక లేదు. మరింత అనుమానంతో దగ్గరకు వచ్చి చూసాడు. అంతే షాక్.. ఎందుకంటే అది మనిషి కాదు.. ఒక బొమ్మ. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకలితో ఉన్న ఆవు, దూడలు.. ఏమి పెడుతున్నాడో చూస్తే షాక్

నా భార్య మహిళ కాదు.. నాకు న్యాయం చేయండి.. కోర్టుకెక్కిన భర్త

కారు ఖరీదు రూ.11 లక్షలు.. రిపేరుకు మాత్రం రూ.22 లక్షలు..

అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి

సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో ఏముందో తెలుసా ??

 

Published on: Oct 09, 2022 09:59 AM