Meme Dog: మీమ్‌ డాగ్‌ ‘చిమ్‌టూ’ ఇక లేదు..

|

May 27, 2024 | 11:02 AM

మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది. క్రికెట్‌, సినిమా, రాజకీయాలు, యూత్‌ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్‌ రూపొందించేవారు. పలు సామాజిక యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి. సోషల్‌మీడియాలో ‘వైరల్‌ డాగీ’గా పేరు పొందడమే కాదు, క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్‌ లోగోలోనూ దీని ఫొటో ఉండేది...

మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది. క్రికెట్‌, సినిమా, రాజకీయాలు, యూత్‌ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్‌ రూపొందించేవారు. పలు సామాజిక యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి. సోషల్‌మీడియాలో ‘వైరల్‌ డాగీ’గా పేరు పొందడమే కాదు, క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్‌ లోగోలోనూ దీని ఫొటో ఉండేది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మరణించినట్లు డాగీ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. ‘మా కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది. అపరిమితమైన సంతోషం, ప్రేమకు కబోసు చిరునామా. మీమ్‌ వరల్డ్‌లో తనదైన ముద్రవేసింది. అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది’ అని డాగీకాయిన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మీమ్‌ వరల్డ్‌లో భారతీయ నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం.

ఈ శునకం థీమ్‌తో రూపొందించిన మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అయ్యాయి. 2010 నుంచి కబోసు చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ ఉండేవి. 2013లో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌ మొదలు పెట్టినప్పుడు కబోసును ప్రొఫైల్‌ పిక్‌గా తీసుకోవడంతో మరింత పాపులర్ అయింది. మొదట్లో దీన్నో జోక్‌గా తీసుకున్నారు. తరువాత డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఇతర డాగ్‌ థీమ్‌ క్రిప్టోలను దాటడం గమనించాల్సిన విషయమే. గతేడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ట్విటర్‌ లోగోగా కబోసు ఫొటోను కొన్ని రోజుల పాటు ఉంచారు. దీంతో డాగీ కాయిన్‌ క్రిప్టో విలువ మరింత పెరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on