Kedarnath: కేదార్‌నాథ్‌లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్.. పరుగులు తీసిన ప్రయాణికులు
పవిత్ర చార్‌ధామ్ యాత్ర లో ఒకటైన కేదార్‌నాథ్‌కు బయల్దేరిన యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, పైలట్ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కేస్ట్రల్ ఏవియేషన్‌కు చెందిన హెలీకాప్టర్ సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు..
పవిత్ర చార్‌ధామ్ యాత్ర లో ఒకటైన కేదార్‌నాథ్‌కు బయల్దేరిన యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, పైలట్ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కేస్ట్రల్ ఏవియేషన్‌కు చెందిన హెలీకాప్టర్ సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేలపై ల్యాండ్ అయ్యింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారు.
సిస్రీ నుంచి కేదార్‌నాథ్ ధామ్‌కు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న హెలికాప్టర్‌ను కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సివచ్చింది. సాంకేతిక సమస్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. హిందువులకు ఈ యాత్ర ఎంతో పవిత్రమైంది. సాధారణంగా చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు జరుగుతుంది. ఇది యమునోత్రి నుంచి మొదలై, గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగి, చివరకు బద్రీనాథ్‌లో ముగుస్తుంది. ఈ యేడాది యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

