Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం.. ఇలాంటి గాయాలను ఎప్పుడూ చూడలేదన్న వైద్యులు

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపుకు లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్‌ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె , మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించారు.

Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం.. ఇలాంటి గాయాలను ఎప్పుడూ చూడలేదన్న వైద్యులు

|

Updated on: May 27, 2024 | 10:28 AM

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపుకు లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్‌ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె , మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించారు. బాధితుల్లో ఆరుగురు పుర్రె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు బ్యాంకాక్‌లోని సమితివేజ్ శ్రీనకరిన్ హాస్పిటల్ డైరెక్టర్‌ వెల్లడించారు. మరో 22 మంది వెన్నెముక, 13 మంది ఎముకలు, కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విమాన కుదుపులకు గాయపడిన అనేక మందికి గతంలో చికిత్స అందించామని పేర్కొన్నారు. కానీ, ఈ తరహా గాయాలను చూడడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు.

గాయపడిన వారిలో రెండేళ్ల నుంచి 83 ఏళ్ల వయస్కులు ఉన్నట్లు వెల్లడించారు. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ముగ్గురు భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే దానిని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనపై సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. బాధితులకు పరిహారాన్ని కూడా అందించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us