World War 3: మూడో ప్రపంచయుద్ధానికి.. ముహూర్తం పెట్టేశారా.?

మూడో ప్రపంచయుద్ధానికి ముహుర్తం కుదిరిపోయిందా..? భవిష్యత్తు గురించి ముందే చెప్పే నేటి తరానికి చెందిన జాతక బ్రహ్మలు ఆ మహా ఉపద్రవానికి కూడా ముహూర్తం పెట్టేశారా..? తాజా పరిస్థితుల్ని అంచనా వేసి.. వాటికి గ్రహాల కూటమి గమనాన్ని మిక్స్ చేసి... ఇదుగో ఇదే ముహూర్తం.. ఇది జరిగి తీరుతుంది అంటూ ఢంగా భజాయించి చెబుతున్నారా..? ఎస్.. ఇప్పుడు ఇదే ట్రెండిగ్ టాపిక్.

World War 3: మూడో ప్రపంచయుద్ధానికి.. ముహూర్తం పెట్టేశారా.?

|

Updated on: May 27, 2024 | 11:15 AM

ఢిల్లీకి చెందిన కుశాల్ కుమార్ అనే ఓ జ్యోతిష్య పండితుడు తాజాగా ఇదుగో ఇదే మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం అంటూ ఓ డేట్ ఎనౌన్స్ చేశారు. అందుకు తాజా పరిస్థితులే సాక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు రైసీ అనుమానాస్పద రీతిలో హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు పాలస్తీనాకు కొన్ని యూరోపియన్ దేశాలు స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడంపై ఇజ్రాయెల్ మండి పడటం, ఇజ్రాయెల్-హమాస్ వార్‌లో ఇరాన్ జోక్యం చేసుకోవడం, అటు కొరియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా చైనా-తైవాన్‌ దేశాల మధ్య మొదలైన టెన్షన్.. వీటన్నింటికీ తోడు దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్… ఈ పరిస్థితులన్నింటినీ అంచనావేస్తూ వాటికి తన జ్యోతిష్య పాండిత్యాన్ని కూడా జోడించి తేదీలను ప్రకటించారు. ఆయన అంచనాల ప్రకారం జూన్ 18న నెలకొన బోయే గ్రహస్థితి మూడో ప్రపంచయుద్ధానికి ముహూర్తం కానుందన్నది ఆయన వాదన. అంతేకాదు పరిస్థితి విషమిస్తే అంతకన్నా ముందే అంటే జూన్ 10 లేదా కాస్త ఆలస్యంగా జూన్ 29 కూడా కావచ్చంటూ లింక్‌డిన్‌లో ఓ ఆర్టికల్ రాశారు. గ్రహస్థితి కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నది ఆయన మాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles