స్కూటీ మీద వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో ఓసారి చూడండి

|

Jul 30, 2024 | 8:11 PM

వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తోటలు, పొలాలు నీట మునగడంతో ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇక ఆవాసం కోసం ఎక్కడ అనువుగా ఉండే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బైకుల్లో ఎక్కువగా పాములు చేరుతున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఓ వ్యక్తి స్కూటీలో ఓ భారీ నాగుపాము దూరింది.

వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తోటలు, పొలాలు నీట మునగడంతో ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇక ఆవాసం కోసం ఎక్కడ అనువుగా ఉండే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బైకుల్లో ఎక్కువగా పాములు చేరుతున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఓ వ్యక్తి స్కూటీలో ఓ భారీ నాగుపాము దూరింది. ఆ విషయం తెలియక ఆ వ్యక్తి స్కూటీ వేసుకొని బయటకు వెళ్లిపోయాడు. స్కూటీ మీద వెళుతున్న ఆ వ్యక్తికి.. బైకునుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఏమై ఉండొచ్చని పరిశీలించిన అతనికి ఎక్కడి నుంచో బుసలు కొడుతున్నట్టు శబ్దం వినిపించింది. స్కూటీ రోడ్డు పక్కకు ఆపి పరిశీలించాడు. ఇంకేముంది ఆ శబ్ధం తన స్కూటీనుంచే వస్తుందని గ్రహించాడు. డిక్కీ ఓపెన్‌ చేసి చూసిన అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు. స్కూటీ డిక్కీలో పాము దూరిన సంగతి తెలియక వాహనదారుడు అప్పటివరకు దాని మీద తిరుగుతూనే ఉన్నాడు. అది తలచుకుని అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎంత ప్రయత్నించినా స్కూటీనుంచి పాము బయటకు రాకపోవడంతో స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు స్థానికులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా ??

ఆ సిటీలో వాహనంలో కన్నా.. నడుస్తూనే త్వరగా వెళ్లొచ్చట

9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు

Follow us on