Loading video

ఆస్పత్రిలో నాగుపాము.. లేవలేని రోగులు కూడ పరుగో పరుగు

|

Dec 17, 2024 | 1:26 PM

తరచూ కురుస్తున్న వర్షాలకు పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, వాహనాలు ఎక్కపడితే అక్కడ పాములు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు పాము కాటుకు గురైన ఘటనలూ ఉన్నాయి. తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. పామును చూసి ఆస్పత్రి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం కార్తికేయ మల్టిస్పెషాల్టి ఆసుపత్రి లో నాగ్ పాము హాల్ చల్ చేసింది. ఎలా వచ్చిందో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఆసుపత్రిలోకి చొరబడిన నాగుపాము ఊహించని విధంగా ఓ వలలో చిక్కుకుంది. వలనుంచి బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నించింది కానీ దానివల్ల కాలేదు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది వలలో పాము ను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ కు వైద్య సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ వర్మ పామును వలనుంచి తప్పించి జాగ్రత్తగా డబ్బాలో బంధించారు. అనంతరం నాగు పామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో వైద్యులు, సిబ్బంది, రోగులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదే పనిగా ఫోన్ చూస్తే.. పిచ్చి పట్టడం ఖాయమా ??

TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం

Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!

వాళ్లకో రూల్‌.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్

పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్