Sleeping boxes: ఆఫీసులో నిద్రకు బాక్స్‌లు.. బాత్రూమ్‌లో ఎక్కువ సేపు గడిపే కంటే.. త్వరలో మనదగ్గరకి కూడా..

రోజంతా అధిక పనితో అలసిపోయినా... రాత్రి మంచి నిద్రతో మరునాడు ఉత్సాహంగా పనిచేస్తాం. మరి పగటిపూట అధిక పనిగంటల వల్ల అలసిపోతే..? అది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది.

Sleeping boxes: ఆఫీసులో నిద్రకు బాక్స్‌లు.. బాత్రూమ్‌లో ఎక్కువ సేపు గడిపే కంటే.. త్వరలో మనదగ్గరకి కూడా..

|

Updated on: Aug 04, 2022 | 9:49 AM


రోజంతా అధిక పనితో అలసిపోయినా… రాత్రి మంచి నిద్రతో మరునాడు ఉత్సాహంగా పనిచేస్తాం. మరి పగటిపూట అధిక పనిగంటల వల్ల అలసిపోతే..? అది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. ప్రపంచంలో అత్యధిక గంటలు పనిచేసే జపనీయులే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే పది గంటలకు పైగా పనిచేయించుకునే రెండు జపాన్‌ కంపెనీలు పరిష్కారమార్గాన్ని కనిపెట్టాయి. నిద్రలేమితో బాధపడుతున్న తమ ఉద్యోగుల కోసం ఇటోకీ ఇంకా కొయొజు గోహన్‌ సంస్థలు న్యాప్‌బాక్స్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాయి. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిసేపు ఆ న్యాప్‌ బాక్సుల్లో కునుకుతీయొచ్చు. కొద్దిపాటి పవర్‌న్యాప్‌ తరువాత మళ్లీ కొత్త శక్తితో పనిచేయొచ్చన్నమాట.ఆహా… బెడ్‌ మీద హాయిగా ఒరిగేయొచ్చని ఆనందించకండి. అవి నిట్టనిలువునా ఉండే బాక్సెస్‌. వీటిని ‘కమిన్‌ బాక్సెస్‌’అంటున్నారు. ఫ్లెమింగోలాగా నిలబడే నిద్రపోవాలన్నమాట. అయితే తల, మోకాళ్లకు ఇబ్బంది లేకుండా, మనిషి పడిపోకుండా సౌకర్యవంతమైన సపోర్ట్‌ సిస్టమ్‌ ఉంటుందని చెబుతున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు బాత్రూమ్‌లో ఎక్కువ సేపు గడిపేకంటే.. ఈ బాక్సెస్‌లో కునుకు బెటర్‌ అని ఇటోకి కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ సీకో కవాషిమా చెబుతున్నారు.అయితే… బ్లూమ్‌బర్గ్‌ దీన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకోగా… నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. శవపేటికలను తలపిస్తున్న వాటిలో పడుకోవడం ఊహించడానికే కష్టంగా ఉందని ఒకరు కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us