Slackline walk: చావుతో చెలగాటం.. అగ్నిపర్వతంపై సాహసం..! ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రఫెల్‌ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్..

Slackline walk: చావుతో చెలగాటం.. అగ్నిపర్వతంపై సాహసం..! ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రఫెల్‌ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్..

Anil kumar poka

|

Updated on: Oct 01, 2022 | 9:15 PM

అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ.. సాహసాలు చేస్తూ ప్రత్యేకంగా అందరి దృష్టి తమవైపు పడేలా చేసుకుంటోంది నేటి యువత. అలాంటికోవకు చెందిన రఫెల్‌ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో


అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ.. సాహసాలు చేస్తూ ప్రత్యేకంగా అందరి దృష్టి తమవైపు పడేలా చేసుకుంటోంది నేటి యువత. అలాంటికోవకు చెందిన రఫెల్‌ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నారు. భగభగమండే లావాలతో బద్దలయ్యే అగ్నిపర్వతాలపై నుంచి నడిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రఫెల్‌ జుంగో బ్రిడి బ్రెజిల్‌కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. స్వయంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేయడం విశేషం. నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌లోని వనాటు వద్ద యసుర్‌ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్‌లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 09:15 PM