Fire Accident: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. మంటల్లో 30 మంది.. ఆరుగురు సజీవదహనం.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్టోబరు 6 తెల్లవారుజూమున ముంబైలోని గోరెగావ్ ఎంజీ రోడ్డులోని ఓ ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు అపార్ట్ మెంట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు మరో 30 మంది వరకు భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్టోబరు 6 తెల్లవారుజూమున ముంబైలోని గోరెగావ్ ఎంజీ రోడ్డులోని ఓ ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు అపార్ట్ మెంట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు మరో 30 మంది వరకు భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. భవనంలోని పార్కింగ్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అక్కడ ఉన్న పాత బట్టలు, చెత్తా చెదారం కారణంగానే ప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. కొద్దిసేపటికే మంటలు పార్కింగ్‌తో సహా మొదటి, రెండవ అంతస్తులకు వ్యాపించాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చిన సహాయక సిబ్బంది క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్లు, బైకులు దగ్ధమయ్యాయి. 10 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..