Boat accident video: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన.. టూరిస్ట్ పడవపై పడిన భారీ కొండచరియలు.. వైరల్ అవుతున్న వీడియో
Brazil Furnas Lake Incident: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. శనివారంనాడు అక్కడి అక్కడి ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో
బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. శనివారంనాడు అక్కడి అక్కడి ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో షికారు చేస్తూ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా పర్వతంలోని కొంత భాగం విరిగి రెండు బోట్లపై పడింది. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ షాకింగ్ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురు కన్నుమూయడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. జలపాతంలో మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారి కోసం రెస్క్కూ టీమ్స్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సమీపంలోని పర్యాటకులు తమ కెమరాల్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా
దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.

