పశువుల కొట్టం నుంచి ఏవో చప్పుళ్లు.. కనిపించింది చూడగానే పరుగో పరుగు..

Updated on: Jul 22, 2025 | 9:55 PM

ఓ రైతు రోజూలాగే తన పశువులకు మేత వేసేందుకు పశువుల కొట్టంలోకి వచ్చాడు. పశువుల కొట్టం శుభ్రం చేసి పశువులకు గడ్డి వేస్తున్నాడు. ఇంతలో కొట్టంలో ఓ మూలనుంచి ఏవో చప్పుళ్లు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలనగా చూసిన అతనికి అక్కడ కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఒక రైతు పశువుల కొట్టంలో పశువులకు గడ్డి వేస్తుండగా కొట్టంలోని ఓ మూలనుంచి శబ్దాలు వినిపించడంతో ఏమై ఉంటుందా అని పరిశీలించిన రైతుకు వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ ఏకంగా గుట్టలు గుట్టలుగా పాములు కనిపించాయి. భయంతో ఒక్క ఉదుటన కొట్టంలోనుంచి బయటపడ్డాడు. స్థానికులకు విషయం చెప్పాడు. వారంతా అక్కడికి చేరుకుని పాములను చూసి భయంతో వణికిపోయారు. పశువుల కొట్టంలో అత్యంత విషపూరితమైన ఈ పాముపిల్లలను చూసి గ్రామస్తులు భయంతో గజగజలాడారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఏకంగా 60 పాములను సురక్షితంగా పట్టుకున్నాడు. వాటిని ఓ పెట్టెలో పెట్టి.. ఆపై అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం కోబ్రా పిల్లలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో

బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన వీడియో

కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో

అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు వీడియో