Viral Video: ఈ రొయ్య వెరీ స్పెషల్‌ !! ఏం చేస్తుందో చూడండి !!

Updated on: Apr 19, 2022 | 9:44 PM

సముద్ర గర్భం ఎన్నో రకాల జీవులకు నివాసం. జీవ వైవిధ్యానికి ఆయువుపట్టు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

సముద్ర గర్భం ఎన్నో రకాల జీవులకు నివాసం. జీవ వైవిధ్యానికి ఆయువుపట్టు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా మనిషి దంతాలను రొయ్య శుభ్రం చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఓ రకమైన రొయ్య.. మనిషి పళ్లను శుభ్రపరుస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసారు. స్కూబా డైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి.. సముద్రంలో పగడపు దిబ్బల దగ్గర నోరు తెరుస్తాడు. అతని దగ్గరికి ఒక రొయ్య వచ్చి, తన పాదాలతో దంతాలు, చిగుళ్ల నుంచి ఆహారాన్ని, మృతకణాలను తినేసి శుభ్రం చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు సదరు స్కూబా డైవింగ్ చేసిన వ్యక్తి.. ‘పళ్ళు శుభ్రం కావాలంటే నన్ను సంప్రదించండి’ అని తాను పోస్ట్‌ చోసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. వాస్తవానికి సముద్రంలోకి ప్రవేశించి, రొయ్యల ద్వారా దంతాలను శుభ్రం చేసుకోగలిగితే.. ఇకపై ఎవరికి టూత్ బ్రష్, డెంటిస్ట్ ల అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Watch:

Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్‌ ఇచ్చిన తల్లిగొర్రె

Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం

వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం