Hand Pump – Liquor: ఏం ఐడియా గురు..! చేతిపంపులో నీరుకు బదులు మద్యం.. కంగుతిన్న అధికారులు.!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న బిగ్ క్యాంపెయిన్‌లో భాగంగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం దాడులు నిర్వహిస్తున్నాయి.
ఎక్కడైనా చేతిపంపును కొడితే నీళ్లు వస్తాయి. కాని మధ్యప్రదేశ్‌లో మాత్రం అక్రమ మద్యం బయటకు వస్తోంది. మధ్యప్రదేశ్ లోని గునాలో లిక్కర్ మాఫియా.. అధికారుల కళ్లుగప్పి అక్రమ మార్గాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారు. పొలాల్లో బోరుపంపును పోలిన హ్యాండ్ పంప్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపు ఆన్ చేయడంతో ఆశ్చర్యపోయారు. ఇక్కడ చేతిపంపులో నీళ్లకు బదులు మద్యం వస్తోంది. పోలీసులు దాడి చేసి లిక్కర్ హ్యాండ్‌పంప్‌ను సీజ్ చేశారు. ఈక్రమంలోనే ఆరు జిల్లాల్లో పోలీసులు అక్రమ మద్యం స్థావరంపై దాడి చేసి సుమారు 6 వేల లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భాన్‌పురా వద్ద నిందితులు భూమిలో ట్యాంక్‌ను పూడ్చిపెట్టి, చేతి పంపును అమర్చారు. అయితే, చేతిపంపులో నీరు కాకుండా మద్యం బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో

