వేగంగా వస్తున్న లోకల్ ట్రైన్.. పట్టాలపై మహిళ పరుగులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ !!

Phani CH

Phani CH |

Updated on: Sep 02, 2022 | 8:34 AM

ముంబయిలో షాకింగ్ ఘటన జరిగింది. బైకుల్లా రైల్వే స్టేషన్ లో 22 ఏళ్ల యువతి లోకల్ ట్రైన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఆమె ప్రాణాలు కాపాడారు.

ముంబయిలో షాకింగ్ ఘటన జరిగింది. బైకుల్లా రైల్వే స్టేషన్ లో 22 ఏళ్ల యువతి లోకల్ ట్రైన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఆమె ప్రాణాలు కాపాడారు. ఆగస్టు 27నఈ ఘటన జరిగినట్లు స్టేషన్ లోని రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో లోకల్ ట్రైన్ వేగంగా వస్తున్న సమయంలో ఓ మహిళ దానికి ఎదురుగా నిలబడి ఉంది. చూస్తుంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికే నిర్ణయించుకుందని అర్థమవుతుంది. అది గమనించి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో మహిళను కాపాడారు. లేకుంటే తీవ్ర నష్టం జరిగేది. అంతే కాదు.. మహిళ అలా పట్టాలపై మహిళ నిలబడి ఉండటాన్ని లోకల్ ట్రైన్ లోకో పైలట్ గమనించాడు. దీంతో ట్రైన్ ను స్లో చేశాడు. అయితే రైలు మహిళ వద్దకు చేరుకోవడంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు, వ్యక్తుల్లో టెన్షన్ మొదలైంది. పట్టాలపై నుంచి వెళ్లిపోవాలని గట్టిగా అరిచారు. అయినా ఆమె పట్టించుకోలేదు. తమ సత్వర చర్యలతో ప్రాణాలను కాపాడినందుకు ఆర్పీఎఫ్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!

కోహ్లీ బయోగ్రఫీలో విజయ్‌ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu