Viral Video: రోటీలు చేస్తోన్న యువ‌తిని సెల‌బ్రిటీ చేసిన సోష‌ల్ మీడియా.. ఏకంగా 20 ల‌క్ష‌ల మంది చూశారు..

Viral Video: సోష‌ల్ మీడియా.. ఈ సరికొత్త విప్ల‌వం ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా మార్చేసింది. అమెరికా నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు ఎక్క‌డ ఏది జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది..

Viral Video: రోటీలు చేస్తోన్న యువ‌తిని సెల‌బ్రిటీ చేసిన సోష‌ల్ మీడియా.. ఏకంగా 20 ల‌క్ష‌ల మంది చూశారు..
Young Girl Roti Making Video

Updated on: Jun 04, 2021 | 1:55 PM

Viral Video: సోష‌ల్ మీడియా.. ఈ సరికొత్త విప్ల‌వం ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా మార్చేసింది. అమెరికా నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు ఎక్క‌డ ఏది జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సామాన్యుల‌ను సెల‌బ్రిటీలుగా మార్చేసింది సోష‌ల్ మీడియా. రైల్వే స్టేష‌న్‌లో భిక్షాట‌న చేస్తున్న మ‌హిళ‌ను సింగ‌ర్‌గా మార్చిన ఘ‌న‌త సోష‌ల్ మీడియాకే ద‌క్కింది. ఇలా నిత్యం ఏదో ఒక అంశం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటుంది.
తాజాగా ఈ జాబితాలోకి మ‌రో వీడియో వ‌చ్చి చేరింది. ఓ యువ‌తికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఓ గ్రామానికి చెందిన యువ‌తి క‌ట్టెల పొయ్యి ముందు కూర్చొని చ‌పాతీలు చేస్తోంది. ఈ స‌మ‌యంలోనే అవ‌త‌ల ఉన్న ఓ వ్య‌క్తి ఆమె వీడియోను తీశారు. ఆ వీడియోనే ఇప్ప‌డు నెట్టింట హంగామా చేస్తోంది. అంత‌లా ఆ వీడియోలో ఏముంద‌నేగా.. ఆ యువ‌తి అంద‌మైన రూప‌మే దీనికి కార‌ణం. జాస్మిన్ సైని ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను ఏకంగా 20 ల‌క్ష‌ల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియాకు మ‌రో కొత్త సెల‌బ్రిటీ దొరికంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో..

Also Read: Hanuman Jayanthi: నేడు హనుమజ్జయంతి.. ఈరోజు విశిష్టత.. జన్మకథ.. పూజావిధానం.. కలిగే ఫలితాలు

China virus coming: నేను ముందే చెప్పానా.. ఇది కుంగ్‌ ఫూ వైరస్‌.. మరోసారి దాడి మొదలు పెట్టిన ట్రంప్

Etela Rajender: నాకు ఓటమి అనేది తెలియదు.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిచా:ఈటల రాజేందర్‌