Robbery Video: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..బైకర్సే టార్గెట్! వరుస దోపిడీలతో భయాందోళనలో జనం.
పంజాబ్ అమృత్‌సర్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి మరీ లూటీ చేశారు. రెండు బైకులపై వచ్చిన దొంగలు మరో బైక్‌పై వెళ్తున్నవారిని అడ్డుకుని, బెదిరించారు.
పంజాబ్ అమృత్‌సర్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి మరీ లూటీ చేశారు. రెండు బైకులపై వచ్చిన దొంగలు మరో బైక్‌పై వెళ్తున్నవారిని అడ్డుకుని, బెదిరించారు. వారివద్దనుంచి విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇటీవల ఒక ఆభరణాల వ్యాపారి మీద దొంగలు దాడికి తెగబడ్డారు. ఇద్దరు దొంగల్లో ఒకరిని ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాడు సదరు వ్యాపారి. ఇద్దరు దొంగలు వ్యాపారిపై దాడి చేసిన దోపిడీ చేయాలని ప్రయత్నించారు. వ్యాపారి ప్రతిఘటించటంతో ఒక దొంగ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రాత్రి 11 గంటల సమయంలో దుండగులు దొంగతనానికి వచ్చారు. ముఖానికి మాస్క్‌లు ధరించి మోటారు సైకిల్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకున్నారు. ఆ దంపతుల వద్ద గల మొబైల్‌ఫోన్లు, పర్సులు, నగదు, నగలు మొత్తం అపహరించారు. తాజాగా జరిగిన ఘటన మూడవదిగా పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..