గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇదేం క్రియేటివిటీ..
ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో యువతీయువకులు చేస్తున్న వింత చేష్టలు చూస్తుంటే.. పిచ్చి పీక్స్‌కు చేరినట్లు అనిపిస్తోంది. నిశ్చితార్థం అయిన జంటలు పెళ్లికి ముందే తమ ప్రేమకథను ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో రొమాంటిక్, క్రియేటివ్, అడ్వెంచరస్ కాన్సెప్ట్స్‌తో షూట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రీ-వెడ్డింగ్ వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వీడియోలో వధూవరులు గాల్లో వేలాడుతూ పోజులు ఇస్తున్నారు. ఇద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, వాటికి రంగురంగుల బెలూన్ల గుత్తిని కట్టుకున్నారు. మొదట చూస్తే బెలూన్ల సాయంతో గాల్లో తేలుతున్నట్లే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి, వారు ఒక పెద్ద క్రేన్ సాయంతో గాలిలో వేలాడారు. వీడియోలో వారు నవ్వుతూ, ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కెమెరా ముందు పోజులు ఇచ్చారు. నేల నుంచి చాలా ఎత్తులో ఉన్న ఈ షూట్, చూసేవారికి భయంతో పాటు “వావ్!” అనిపించే భావనను కలిగించింది. ఈ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యం, ఆందోళన, సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు. గుజరాత్‌కి చెందిన ఈ జంట చేసిన సాహసోపేత షూట్ చూసి కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు “ ఏఐతో ఇదే ఎఫెక్ట్ వచ్చేలా చేయొచ్చు కదా ఇంత రిస్క్ అవసరమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..
అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

