Rhino Birthday Celebrations: తన పన్నెండో పుట్టినరోజుకి కీబోర్డు ప్లే చేస్తూ సందడి చేసిన ఖడ్గమృగం ‘బంధు’ Video Viral

Rhino Birthday Celebrations: పుట్టినరోజు అందరికీ పండగే.. కొందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు.. మొత్తమ్మీద సరదాగా గడపడానికే ప్రయత్నిస్తారు.

Rhino Birthday Celebrations: తన పన్నెండో పుట్టినరోజుకి కీబోర్డు ప్లే చేస్తూ సందడి చేసిన ఖడ్గమృగం బంధు Video Viral
Rhino Birthday Celebrations

Updated on: May 21, 2021 | 3:51 PM

Rhino Birthday Celebrations: పుట్టినరోజు అందరికీ పండగే.. కొందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు.. మొత్తమ్మీద సరదాగా గడపడానికే ప్రయత్నిస్తారు. మరి జంతువులకు ఆ సరదాలు ఉండవా? వాటికి ఉన్నా లేకపోయినా వాటిని సంరక్షించే వాళ్ళకు అటువంటి సరదా ఉంటుంది కదా. వాళ్ళు తమ సంరక్షణలో ఉన్న జంతువులకు పుట్టినరోజు జరిపించాలని అనుకోవడం అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చెప్పబోయేది అటువంటి పుట్టినరోజు వేడుకే. యూఎస్ లోని కొలరాడో సిటీ పార్క్ లో ఒక ఖడ్గమృగానికి పుట్టినరోజు వేడుకలు చేశారు. మామూలుగా ఎదో వాటికి కావాల్సిన ఫుడ్ పెట్టి.. అక్కడకు వచ్చిన వారికీ ఓ స్వీట్ పెట్టి పంపించేయలేదు. ఆ ఖడ్గమృగంతో కీబోర్డ్ ప్లే చేయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఖడ్గమృగం పేరు బంధు. ఇది దీనికి 12వ పుట్టినరోజు. దాని పుట్టినరోజు సందర్భంగా జూలోని కేర్ టేకర్.. దానికి వేడుకలు చేశాడు. ఆ వేడుకల్లో ఈ బంధు కీ బోర్డు ప్లే చేసింది. ఈ వీడియోను డెన్వర్ జూ అనే ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ డెన్వర్ జూ ఈ విధంగా రాశారు. ” మాజూలో ఉంటున్న బంధు.. ఒక కొమ్ము ఖడ్గమృగ పురుషుడికి పన్నెండేళ్ళు వచ్చాయి. ఇది అతని పుట్టినరోజు. మా బంధు తన పుట్టినరోజుకు మీ అందరికీ వినోదాన్ని అందిస్తాడు. తానే స్వయంగా ఒక పాటని కీ బోర్డు పై కంపోజ్ చేసి వినిపిస్తున్నాడు. ఈసారి మీరు మా జూని సందర్శించినపుడు టయోటా ఎలిఫెంట్ పాసేజ్ లో ఉండే మా బంధును కలిసి వెళ్ళండి.”

బంధు కీ బోర్డ్ ప్లే చేస్తున్న వీడియో ఇదే..

ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 22,000 కంటే ఎక్కువ వీక్షణలు అలాగే, 4,200 లైక్‌లను సంపాదించింది. చాలామంది ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు. అందరూ బంధు పాటను మెచ్చుకుంటున్నారు.

Also Read: Nasa Rover: మార్స్‌పై “మిస్టరీ రాయి” ని కనుగొన్న నాసా రోవ‌ర్‌….( వీడియో )

Viral Video: ఢిల్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన రోడ్డు.. వెళ్తున్న ట్రక్కు ఎలా పడిందో చూశారా..? వీడియో వైరల్