Viral Video: ‘ఉగాది రోజు నేల వైపు దూసుకొచ్చినవి ఉల్కలు కాదు.. అది చైనా పనే’.! ఆసక్తికర విషయాలు..

Viral Video: ఉగాది పండగ రోజు (Ugadi) ఏప్రిల్‌2న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన కాంతి భూమి వైపు దూసుకొచ్చాయి. దీంతో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి..

Viral Video: 'ఉగాది రోజు నేల వైపు దూసుకొచ్చినవి ఉల్కలు కాదు.. అది చైనా పనే'.! ఆసక్తికర విషయాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2022 | 6:55 AM

Viral Video: ఉగాది పండగ రోజు (Ugadi) ఏప్రిల్‌2న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన కాంతి భూమి వైపు దూసుకొచ్చింది. దీంతో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ స్మార్ట్‌ ఫోన్లలో ఆ అద్భుతాన్ని బంధించి సోషల్‌ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వార్త కాస్త వేగంగా వ్యాపించింది. ఆకాశం నుంచి రాలిపడినవి ఉల్కలే  (Meteor) అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ, మహారాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన ఈ అద్భుతం ఉల్కలు కావని తాజాగా పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రోఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఆకాశంలో కనిపించినవి ఉల్కలు కాదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ విషయమై ప్రముఖ పరిశోధకులు జోనాథన్‌ మెక్‌డోవెల్‌ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన.. ‘ఆకాశం నుంచి రాలిన ఆ వస్తువులు ఉల్కలు కాదు. అవి గతంలో చైనా ప్రయోగించిన రాకెట్‌కు సంబంధించిన శకలాలు. చైనా ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన చాంగ్ జెంగ్ 3B సీరియల్ నంబర్ Y77 రాకెట్‌ మూడవ దశ భాగాలు అయ్యుండొచ్చని నా అంచనా’ అంటూ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని ఓ గ్రామంలో నేల రాలిన కొన్ని వస్తువులు ఇది ఉల్కలు కాదని, గ్రహ శకలాలేనని చెప్పకనే చెప్పాయి. ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రవీణ్ ముదోల్కర్‌ పంటపొలాల్లో కనిపించిన కొన్ని వస్తువులకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ అంశం కాస్త వైరల్‌గా మారింది. ఈ వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

Also Read: రిప్డ్ జీన్స్‌ స్టైలిష్ టాప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్

Unemployment in India: ఉపాధి రంగంలో శుభవార్త.. మార్చిలో తగ్గిన నిరుద్యోగిత రేటు..!

IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తదుపరి మ్యాచ్‌కు జట్టులో చేరనున్న ఆ స్టార్‌ ఆటగాళ్లు!..