జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో
వర్షాకాలం మొదలైందంటే చాలు కాలువలు, చెరువులు, నీటి కుంటలు పొంగి పొర్లుతుంటాయి. ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఆయా ప్రాంతాలు మొత్తం చిత్తడిగా మారిపోతాయి. ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు, కుంటల వద్ద పెద్దసైజు కప్పలు కనువిందు చేస్తుంటాయి. తొలకరి జల్లులతో పాటు కనిపించే ఈ అరుదైన జీవులు మానవ మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి, వాటి రాకతో వర్షాలు వస్తాయని రైతులు నమ్ముతారు.
అయితే, వర్షాకాలం మొదలు కావడంతో తాజాగా ఇలాంటి కప్పలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దర్శనమిచ్చాయి.జగిత్యాల జిల్లాలో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సహజంగా మన ప్రాంతాల్లో పసుపు రంగు కప్పలు కనబడవు.. చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడుతాయి. అయితే, మన ప్రాంతాల్లో వర్షాకాల సమయంలో మాత్రమే ఈ పసుపు రంగు కప్పలు కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా వర్షాకాలం ప్రారంభం కానుండడంతో జగిత్యాలలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కురిశాయి. దీంతో ఆ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకున్నాయి. ఇలా నీరు చేరిన ఓ మడుగులో ఈ పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి.
మరిన్నివీడియోల కోసం :
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

