Rare Temple Video: గండాలు దాటించే శివుడు..! గుండం రాజేషుడు.. తెలంగాణాలో అరుదైన ఆలయం.. వీడియో
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గూడూరులోనీ కాకతీయుల కాలం నాటి అతిపురాతనమైన, అరుదైన శివాలయానికి భక్తులు పోటెత్తారు. కేవలం జిల్లా నుండి మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా శివభక్తులు బారులు తీరారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గూడూరులోనీ కాకతీయుల కాలం నాటి అతిపురాతనమైన, అరుదైన శివాలయానికి భక్తులు పోటెత్తారు. కేవలం జిల్లా నుండి మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా శివభక్తులు బారులు తీరారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ ఏపూరు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోనీ కొత్తగూడ మండలం గుండం గ్రామంలోనీ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి కాకతీయుల కాలం నాటి శివాలయం ఇది. ఇక్కడి శివాలయానికి ఓ విశిష్టత ఉంది. ఇక్కడ కొలువైన శివుడుకి రెండు గర్భాలయాలుంటాయి. అందులో ఒకదాంట్లో ఆ పరమేశ్వరుడు విగ్రహరూపంలో దర్శనమిస్తే..మరో గర్భగుడిలో లింగరూపంలో భక్తులను కాటాక్షిస్తుంటాడు. తెలంగాణాలో ఇలాంటి దేవాలయం మరెక్కాడా లేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయానికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర, ఏఎస్పీ యోగేష్ లు సతీసమేతంగా వచ్చి దర్శించుకుని, ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహా శివరాత్రి నాడు ఇక్కడి స్వామివారికీ అభిషేకం చేస్తే గండాలు పోతాయని నానుడి. “గుండం రాజేషున్ని కొలిస్తే…! గండాలు తీరుస్తాడు” అని నానుడి ప్రచారంలో ఉంది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతీ శివరాత్రి నాడు ఇక్కడి స్వామి వారిని దర్శించుకుని, పూజలు జరిపిస్తుంటాడు. ఈ శివరాత్రికీ కూడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..